జవహర్ నగర్‌లో ఇద్దరు మిస్సింగ్..

by Sumithra |   ( Updated:2023-03-24 16:39:38.0  )
జవహర్ నగర్‌లో ఇద్దరు మిస్సింగ్..
X

దిశ, జవహర్ నగర్ : జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు కనిపించకుండా పోయారు. సీఐ బిక్షపతి రావు కథనం ప్రకారం..జమ్మిగడ్డలోని బీజేఅర్ కాలనీకి చెందిన బండారి శ్రీనివాస్ గౌడ్, రజిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు బండారి శ్రావణి (20) రాధిక థియేటర్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో ఉద్యోగం చేస్తున్నది. ఈ క్రమంలోనే సహా ఉద్యోగి రాజుతో తరుచుగా ఫోన్లో మాట్లాడుతుండటంతో ఇంట్లో వారు మందలించారు. దీంతో పెట్రోల్ బంకులో గతేడాది ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ నెల 19న ఇంట్లో నుండి బయటకు వెళ్లిన శ్రావణి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో శ్రావణితో చనువుగా ఉంటున్న రాజుపై అనుమానం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

అప్పుల బాధతో వ్యక్తి..

భార్యాభర్తల దాంపత్యంలో అప్పులు ఇరువురి మధ్య గొడవలకు దారితీశాయి. మౌలాలి చెందిన పూర్ణిమ (32), సంతోష్ నగర్‌కు చెందిన బాసాని థామస్(34) దంపతులు. వీరికి జ్యోష్ణ (9), రాజు(7) సంతానం కలదు. గత ఏడేండ్ల నుంచి అప్పుల బాధల వలన ఇరువురి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో గత ఆరు నెలల కిందట బాసాని థామస్ బాలాజీ నగర్‌లోని తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. ఈ క్రమంలోనే భర్త తమను పట్టించుకోవడం లేదని భార్య ఈస్ట్ మారేడ్ పల్లి పోలీస్‌స్టేషన్‌లో పూర్ణిమ ఫిర్యాదు చేసింది. దంపతులకు కౌన్సిలింగ్ నిమిత్తం థామస్‌కు పోలీసులు ఫోన్ చేయగా రెండు నెలల నుంచి కనపడకుండా పోయాడని థామస్ తల్లి చెప్పింది. దీంతో థామస్ ఆచూకీ కోసం పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story