పోలీసుల ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోయిస్టులు హతం

by Sridhar Babu |   ( Updated:2021-06-01 05:16:27.0  )
పోలీసుల ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోయిస్టులు హతం
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొండగావ్ జిల్లా కుయమారి అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. కొండగావ్ ఎస్‌పి సిద్ధార్థ తివారి ఈ ఎన్‌కౌంటర్‌ని ధృవీకరించారు. ధనోరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుయమరి అటవీప్రాంతంలో నక్సల్స్ కదలికలు ఉన్నట్లుగా అందిన సమాచారం మేరకు డిఆర్‌జి జవాన్లు వెళ్ళి గాలిస్తుండగా.. ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలిపారు.‌

ఇప్పటికి ఇద్దరు నక్సల్స్ (ఒక మగ, ఒక ఆడ) మృతదేహాలతోపాటు ఆటోమేటిక్ వెపన్స్, నక్సల్స్ ఇతర వినియోగ వస్తువులు సంఘటన ప్రాంతంలో జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు నాలుగు గంటలుగా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Next Story