చికెన్ తిని ఇద్దరు చిన్నారులు మృతి

by Anukaran |   ( Updated:2021-08-17 05:00:59.0  )
చికెన్ తిని ఇద్దరు చిన్నారులు మృతి
X

దిశ‌,న‌ర్సాపూర్‌: క‌లుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మ‌ర‌ణించ‌గా త‌ల్లి ప‌రిస్థితి విష‌యంగా ఉంది. ఈ ఘ‌ట‌న మెద‌క్ జిల్లాలోని మ‌నోహ‌ర‌బాద్ మండ‌లంలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకెళితే తూప్రాన్ మండ‌లం వెంక‌టాయిప‌ల్లి గ్రామానికి చెందిన బుల్లె మ‌ల్లేశం, బుల్లె బాల‌మ్మ వారి కూతురు మ‌నీషా, కుమార్‌లు బ‌తుకు దెరువుకోసం మ‌నోహ‌ర‌బాద్‌లోని ఓ పౌల్ట్రిఫాంలో గ‌త కొంత కాలంగా ప‌నిచేస్తున్నారు. మంగ‌ళ‌వారం నాడు ఫారంలోని కోళ్ల‌ను వండుకొని తిన్నారు. భోజ‌నం చేసిన కొద్దిసేప‌టికి వారికి తీవ్రంగా క‌డుపునొప్పి రావ‌డంతో చికిత్స కోసం తూప్రాన్ ఆసుప‌త్రికి వెళ్లెస‌రికి బుల్లె మ‌నీషా (13) బుల్లె కుమార్‌(10)లు మ‌ర‌ణించారు. త‌ల్లి భాల‌మ్మ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. వైద్యులు ప‌రీక్ష‌లు చేసి చికిత్స అందిస్తున్నారు. దీంతో అటు మ‌నోహ‌రబాద్ మండ‌లం, ఇటు తూప్రాన్ మండ‌లంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed