ప్రమాదంలో వ్యాపారులు మృతి.. రూ.కోటి విలువైన బంగారం ఏమైంది..?

by srinivas |   ( Updated:2021-02-23 01:01:40.0  )
ప్రమాదంలో వ్యాపారులు మృతి.. రూ.కోటి విలువైన బంగారం ఏమైంది..?
X

దిశ, వెబ్‌డెస్క్ : వారంతా జ్యువెలరీ షాపులకు బంగారం విక్రయించే వ్యాపారులు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నలుగురు వ్యాపారులు కోటి రూపాయల విలువైన బంగారంతో తెలంగాణకు వచ్చారు. మంగళవారం తెల్లవారుజామున పెద్దపల్లి జిల్లాలోకి ఎంటరైన వీళ్ల కారు.. రామగుండం రాజీవ్ రహదారిపై మల్యాలపల్లి మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.

Gold

ఈ ప్రమాదంలో బంగారం వ్యాపారులు కొత్త శ్రీనివాస్, కొత్త రాంబాబు అక్కడికక్కడే మృతి చెందారు. సంతోష్, సంతోష్ కుమార్‌లకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కారులో లభించిన కోటి రూపాయల విలువైన బంగారాన్ని 108 సిబ్బంది నిజాయితీగా రామగుండం ఎస్ఐ శైలజకు అప్పగించారు. దీంతో వారిని పోలీసులతోపాటు స్థానికులు అభినందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామగుండం సీఐ తాండ్ర కర్ణాకర్ రావు తెలిపారు.

Car accident

Advertisement

Next Story

Most Viewed