ఒకే గదిలో ఇద్దరు యువతుల ఆత్మహత్య

by Sumithra |
ఒకే గదిలో ఇద్దరు యువతుల ఆత్మహత్య
X

హైదరాబాద్‌లో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకెళితే..హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్‌లో మమత ఉండేది. ఆమె స్నేహితురాలు గౌతమి. వీరిద్దరు స్నేహితులు. వీరు డిగ్రీ చదివేవారు. కాగా, 10 రోజుల్లో మమత పెళ్లి జరగాల్సి ఉంది. మమత తల్లిదండ్రులు ఓ శుభకార్యానికి వెళ్లగా, సోదరుడు స్కూల్‌కు వెళ్లాడు. సోదరుడు తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి పైకప్పుకు ఉన్న ఇనుపరాడ్‌కు ఉరేసుకుని మమత, గౌతమి కనిపించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇద్దరమ్మాయిలు రాసిన సూసైడ్ నోట్‌లో తాము తమ తల్లిదండ్రులకు భారం అయ్యాయమనీ, పెళ్లికి భారీగా లాంఛనాలు సమర్పించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతుల ఆత్మహత్యకు గల కారణాలపై విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed