విషాదం.. బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

by Sumithra |
విషాదం.. బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొన్నది. బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ధర్మపురి మండలం నక్కలపేటలో గురువారం ప్రమాదావశాత్తు ఇద్దరు చిన్నారులు బావిలో పడి మృతిచెందినట్లు సమాచారం. చిన్నారులు కార్మిక్, సిద్ధార్థగా గుర్తించినట్లు తెలిసింది. దీంతో నక్కలపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Next Story