- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్ర ప్రయోగంతో ఇద్దరు చిన్నారులు మృతి
అసస్మారక స్థితిలోకి వెళ్లిన నలుగురు చిన్నారులను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, తల్లిదండ్రుల మూఢనమ్మకంతో మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లారు. దీంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లా కదంతాలి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు నుంచి ఏడేండ్ల మధ్య వయసున్న ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఆడుకోవడానికి సమీప అడవిలోకి వెళ్లారు. సాయంత్రం పూట తిరిగి ఇంటి వచ్చిన కొద్దిసేపటికే నలుగురూ అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లడానికి బదులుగా మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లగా, ఆయన చిన్నారులపై పలు మంత్రవిద్యలు ప్రయోగించాడు. ఈ క్రమంలో పరిస్థితి విషమించిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తేరుకున్న స్థానికులు మిగతా ఇద్దరు బాలికలను ఆస్పత్రికి తరలించారు. అయితే, చిన్నారులు ఆడుకోవడానికి వెళ్లిన దగ్గర ఏమైన విషపూరితమైన కాయలుగానీ, పండ్లుగాని తినుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మృతుల కుటుంబాలను అధికార టీఎంసీ ఎమ్మెల్యే దిపాలి విశ్వాస్ కలిసి, పరామర్శించారు. మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లకుండా, ఆస్పత్రికి తరలించి ఉంటే పిల్లలు బతికుండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మూఢనమ్మకాలను వీడాలని గ్రామస్తులను కోరారు.