- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IVF మిస్టేక్ : మరొకరి పాపను కడుపున మోసిన తల్లులు..
దిశ, ఫీచర్స్ : కాలిఫోర్నియాకు చెందిన అలెగ్జాండర్, డఫ్నా కార్డినాలే దంపతులు. 2019 చివరన డఫ్నా ఆడశిశువుకు జన్మనిచ్చారు. అయితే IVF ప్రక్రియ ద్వారా పుట్టిన బిడ్డ తమ కంటే ముదురు రంగులో ఉండటంతో దంపతులకు అనుమానమొచ్చింది. దాంతో వారు డీఎన్ఏ టెస్ట్ చేయించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం డీఎన్ఏ పరీక్ష చేయించారు. నెల రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో దంపతులు సదరు IVF కంపెనీపై దావా వేశారు.
కాలిఫోర్నియాకు చెందిన రెండు జంటలు సంతానం కోసం ఒకే సమయంలో సంతానోత్పత్తి క్లినిక్(IVF)ను ఆశ్రయించాయి. ఈ టైమ్‌లో లాస్ ఏంజెల్స్‌కు చెందిన ‘కాలిఫోర్నియా సెంటర్ ఫర్ రిప్రొడక్టివ్ హెల్త్(CCRH)’ యజమాని డాక్టర్ ఎలిరాన్ మోర్ అండ్ టీమ్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మెచ్యూర్డ్ ఎగ్స్‌ను మిక్స్-అప్ చేయడంతో తల్లుల జెనిటికల్ చైల్డ్‌కు బదులుగా మరొక బిడ్డను మోయాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న డఫ్నా.. తన బిడ్డకు కాకుండా మరొకరి కూతురికి జన్మనిచ్చానని కుమిలిపోయింది. ఆ సమయంలో భయం, ద్రోహం, కోపంతో పాటు పలు హృదయవిదారక భావాలు పొందానని ఆమె తెలిపింది.
మరో జంటతో ఈ విషయంపై కాంటాక్ట్ అయిన డఫ్నా దంపతులు.. ఫైనల్‌గా మూడు నెలల తర్వాత సొంత బిడ్డను తీసుకుని వారి పాపను వారికిచ్చేశారు. ఆ తర్వాత IVFపై దావా వేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. CCRH చేసిన పనివల్ల తన మొదటి బిడ్డ సొంత చెల్లితో కాకుండా మరొకరి పాపతో అనుబంధాన్ని పెంచుకుందని.. తనతో మాట్లాడలేకపోతున్నందుకు, చూడలేకపోతున్నందుకు బాధపడుతోందని తెలిపింది. వీటన్నింటికి CCRH శిక్ష అనుభవించాల్సిందేనని అభిప్రాయపడింది. కాగా 2019 సెప్టెంబర్‌లో ఒక వారం తేడాతో ఈ ఆడపిల్లలిద్దరూ జన్మించారు.