రెండు బైకులు ఢీ.. ఇద్దరు దుర్మరణం

by srinivas |
రెండు బైకులు ఢీ.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు బైకులు ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోరాడపేట వద్ద రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మ‌ృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు వంగర వాసి సతీష్, కోరుకొండ వాసి ప్రజ్వల్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story