- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్.. మందు, వేశ్యల కోసం యువకుల దొంగతనాలు
దిశ, మియాపూర్: తాళం వేసిన కిరాణా షాపులే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న యువకులను మియాపూర్ పోలీసులు మాటు వేసి చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల కిందట మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 చోట్ల దొంగతనం జరిగింది. ఈవిషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మియాపూర్ పోలీసులు గట్టి నిఘాను పెంచారు. ఈ క్రమంలో మళ్ళీ దొంగతనం చేసేందుకు శ్రీ నగర్‌లో ప్లాన్ చేయగా.. ఇది గమనించిన పోలీసులు వారిని పట్టుకున్నారు.
నిందితుల వివరాలు..
సర్దార్ జగ్ జోత్ సింగ్( 20 ) వృత్తి ప్యాకింగ్ కంపెనీలో ఉద్యోగి. పల్లపు మల్లిఖార్జున్ (21) వృత్తి పాన్ షాప్ నడుపుతున్నాడు. వీరు సనత్ నగర్ కు చెందినవారు. మూడో వ్యక్తి వివేక్ గౌడ్ ఇటీవల ఆక్సిడెంట్ కావడంతో యశోదలో చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. వీరంతా దోచుకున్న డబ్బులతో మద్యం సేవించడం, వ్యభిచార గృహాలకు వెళ్ళడం చేస్తుంటారు. డబ్బులు అయిపోగానే మళ్ళీ దొంగ అవతారం ఎత్తుతారు. ఇక నిందితుల నుంచి రూ. 2 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరు మియాపూర్ 4, మాదాపూర్2 , చందానగర్2, జీడిమెట్ల 2, కేపీహెచ్‌బీ 4 షాపుల్లో మొత్తం రూ. 4 లక్షల 92 వేల 500 రూపాయలు అపహరిచుకుపోయారు.