- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్విట్టర్ గూట్లో ‘ఫ్లీట్స్’ ఫీచర్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్.. నెటిజన్ల సౌలభ్యం కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇదే క్రమంలో తాజాగా ఇండియన్ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. పొట్టి పొట్టి పదాలతోనే.. ప్రకంపనలు సృష్టించే ఈ పిట్ట గూట్లో ఇప్పుడు ‘ఫ్లీట్స్’ వచ్చి చేరాయి. అసలు ఏంటీ ‘ఫ్లీట్స్’
ట్విట్టర్ ‘ఫ్లీట్స్’ ఫీచర్‌ను ముందుగా భారత్‌లోనే ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నట్లు ట్విట్టర్ మంగళవారం ప్రకటించింది. కాగా నేటి (గురువారం) నుంచి ఇండియన్ యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చింది. యూజర్ పోస్ట్ చేసిన కంటెంట్ 24 గంటలు మాత్రమే వాల్‌పై కనిపిస్తుంది. తర్వాత ఆ ఫ్లీట్ కనిపించదు. కాగా అప్పటికప్పుడు యూజర్లకు వచ్చిన ఆలోచనలను పంచుకునేందుకు ఈ ‘ఫ్లీట్స్’ ఉపయోగపడుతుంది. వీటికి రీట్వీట్స్ గానీ లైక్స్, పబ్లిక్ కామెంట్స్ గానీ ఉండవు. ఒకవేళ ఆ అంశంపై ఏ యూజరైనా స్పందించాలనుకుంటే.. ప్రైవేట్‌గా డైరెక్ట్ మెసేజ్‌లు పంపవచ్చని పేర్కొంది. యూజర్లు ప్రొఫైల్ పిక్చర్‌పై ట్యాప్ చేయడం ద్వారా ఫ్లీట్స్ చేయొచ్చు.
ఫ్లీట్స్ అనేది ట్వీట్స్‌లానే ఉంటుంది. ఇందులో యూజర్ వీడియోలు, జిఫ్‌లు ఫోటోస్‌ను షేర్ చేయొచ్చు. అంతేకాదు ఈ ఫీచర్‌పై ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సిందిగా ట్విట్టర్ యూజర్లను కోరుతోంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్‌ను సపోర్ట్ చేసే ఫోన్‌లలో ఫ్లీట్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ తరహా ఫీచర్ ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్సాప్, స్నాప్‌చాట్‌లలో అవలేబుల్‌గా ఉంది.