- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్విట్టర్ ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ రాజీనామా
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మహిమా కౌల్ శనివారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. మహిమా కౌల్ రాజీనామాన ట్విట్టర్ ధ్రువీకరించింది. ఆమె రాజీనామాకు ఇటీవల జరిగిన సంఘటనలతో సంబంధం లేదని ట్విట్టర్ పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షులు మోనిక్ మీష్ తెలిపారు. మార్చి చివరి వరకు ఆమెనే ట్విట్టర్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా కొనసాగుతారని వివరించారు. ఐదేళ్లపాటు ఈ బాధ్యతలు నిర్వర్తించిన మహిమా కౌల్ తప్పుకోవడం తమకూ బాధాకరంగా ఉన్నదని, ఆమె వ్యక్తిగత జీవితానికీ సమయాన్ని కేటాయించాలన్న కౌల్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. రైతు ఆందోళనల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన ట్విట్టర్ ఖాతాలను పునరుద్ధరించడంపై సంస్థకు హెచ్చరికలు వచ్చాయి. కానీ, కౌల్ రాజీనామాకు వీటితో సంబంధం లేదని సంబంధితవర్గాలు తెలిపాయి.