- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లు మరోసారి హ్యాక్..
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లు మరోసారి హ్యాక్ అయ్యాయి. వీరిలో ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్ కూడా ఉన్నారు. అదే విధంగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న జోయ్ బిడెన్, టెస్లా కార్ల సంస్థ ముఖ్యకార్యనిర్వాహకాధికారి ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ తదితరుల ఖాతాలు కూడా ఉన్నాయి.
వీరి ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ అయినట్లు రెండ్రోజుల కిందట (బుధవారం) గుర్తించారు. వీటిని క్రిప్టో కరెన్సీకి చెందిన స్కామర్‌లు హ్యాక్ చేసినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. వెంటనే అప్రమత్తమైన వీరు..ట్విట్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ట్విట్టర్.. సెక్యూరిటీపరంగా ఎలాంటి ఇబ్బందీ లేదని, అయితే వీరి అకౌంట్లు ఎలా హ్యాక్ అయ్యాయన్న దానిపై విచారణ జరుపుతున్నామని తెలిపింది.దీనిపై పూర్తి సమాచారాన్ని త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించింది. కాగా శుక్రవారం ఆస్ట్రేలియాకు చెందిన కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారుల ట్విట్టర్ ఖాతాలు కూడా హ్యాక్ కు గురుయినట్లు తెలుస్తోంది.కాగా, దీనిపై ట్విట్టర్ అధికారంగా స్పందించాల్సి ఉంది.