46 ఏళ్లకు అమ్మచేతి వంట తిన్నా : ట్వింకిల్

by Shyam |
46 ఏళ్లకు అమ్మచేతి వంట తిన్నా : ట్వింకిల్
X

ఫన్నీ కామెంట్స్‌తో పాటు కాంట్రవర్సీ కామెంట్లకు బాలీవుడ్ నటి, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటారు. తన కామెంట్లతో అక్షయ్‌ను కూడా చాలా సార్లు ఇబ్బంది పెట్టిన ట్వింకిల్.. తాజాగా ‘అమ్మ చేతి వంట తినేందుకు నాకు కేవలం 46 సంవత్సరాలు పట్టింది’ అని చమత్కరించారు. లాక్‌డౌన్‌ వేళ.. సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్వింకిల్ ఖన్నా కోసం ఆమె తల్లి, అలనాటి నటి డింపుల్ కపాడియా ఇటీవల ప్రైడ్ రైస్ చేశారట. దానికి సంబంధించిన ఫొటోను ట్వింకిల్‌ ఖన్నా ట్విట్టర్లో పంచుకుంది. ఆ ఫొటోకు జతగా.. ‘మా అమ్మ చేతి వంట తినడానికి నాకు కేవలం 46 సంవత్సరాలు పట్టింది. వరుస లాక్‌డౌన్లు కొనసాగించడంతో నా కోసం మొదటిసారిగా మా అమ్మ ఫ్రైడ్ రైస్‌ చేసింది. అందరూ అమ్మ చేతి వంటని పొగుడుతుంటారు.. అదేంటో ఆ అద్భుతాన్ని నేను ఇప్పుడు తెలుసుకున్నా.. మామామియా’ అంటూ కామెంట్ పెట్టారు.

కాగా అక్షయ్‌కుమార్‌తో పెళ్ళి విషయాన్ని తన తల్లి దగ్గర ప్రస్తావించినపుడు ఆమె అక్షయ్‌ ‘గే’ అని చెప్పిందంటూ.. ఇటీవలే ట్వింకిల్ ఖన్నా ఓ ఇంటర్య్వూలో చెప్పి అందర్నీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో తను తల్లితో విభేదించడంతో కొద్ది రోజులు అక్షయ్‌కుమార్‌తో లివింగ్ రిలేషన్‌షిప్‌‌లో ఉండమని ఆమె చెప్పిందట. అలా.. అక్షయ్‌తో ట్వింకిల్ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చిందని ఇటీవలే చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed