- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెండో లాక్‌డౌన్‌లో 22 వేల కేసులు; 722 మృతులు
దిశ, న్యూస్ బ్యూరో : మొదటి లాక్‌డౌన్ ముగిసే నాటికి (ఏప్రిల్ 14) దేశవ్యాప్తంగా 10,816 కరోనా పాజిటివ్ కేసులుంటే రెండో లాక్‌డౌన్‌లోని రెండు వారాల్లో ఆ సంఖ్య 22 వేలు పెరిగి 33,160కు చేరుకుంది. కరోనా మృతుల సంఖ్య సైతం 353 నుంచి మూడు రెట్లు పెరిగి 1,075కు పెరిగింది. రోజుకు సగటున 1500 కంటే ఎక్కువ కేసులే కొత్తగా నమోదవుతున్నాయి. సగటున 50 మంది చొప్పున కరోనా కారణంగా చనిపోతున్నారు. పెరుగుతున్న కేసులు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనే అధికం. రికవరీలు కూడా పెరుగుతున్నప్పటికీ లాక్‌డౌన్ కాలంలోనే పాజిటివ్ కేసులు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 583 కొత్త కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య పదివేల మార్కు (10,498) దాటింది. ఇందులో దాదాపు 60% కేసులు ముంబయి నగరంలోనే ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా గురువారం 1823 కేసులు కొత్తగా నమోదయ్యాయి. 71 మంది మృతి చెందగా 576 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం యాక్టివ్ పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 24,162గా ఉంది.
తమిళనాడులో కొత్తగా 161 కేసులు నమోదైతే.. ఇందులో 138 ఒక్క చెన్నైనగరం నుంచే. మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి, రాజధాని నగరం ముంబయి నుంచే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఆంద్రప్రదేశ్‌లో నాలుగైదు రోజులుగా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 71 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1403కు చేరుకుంది. లాక్‌డౌన్‌లోనే కేసుల సంఖ్య ఇలా పెరుగుతుంటే ఇక ఆంక్షల సడలింపుతో ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అనే చర్చ జరుగుతోంది. వచ్చే నెల 3వ తేదీతో ముగియనున్న రెండో విడత లాక్‌డౌన్ తర్వాత మామూలు స్థితి ఉంటుందా లేక మళ్ళీ కొనసాగింపు ఉంటుందా అనే చర్చలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగించాలని రాష్ట్రాలు కోరుతున్నా ఆర్థిక పరిస్థితి, రోజువారీ అవసరాలు, ప్రజల సంక్షేమ పథకాలకు నిధుల కొరత లాంటివాటిని దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్ నుంచి విముక్తి కావాలనే కోరుకుంటున్నాయి. ఆ దిశగానే ఒక్కో సడలింపు ఇస్తున్నాయి.
Tags: Corona,India, Positive Cases, Maharashtra, Mumbai, Tamilnadu, Chennai, LockDown