తగ్గిన టీవీఎస్ అమ్మకాలు!

by Harish |
తగ్గిన టీవీఎస్ అమ్మకాలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయంగా కరోనా వైరస్ కారణంగా సరఫరా తగ్గడంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ విక్రయాలు 15 శాతం తగ్గాయని సంస్థ వెల్లడించింది. కరోనాతో పాటు ఏప్రిల్ నుంచి అమలుకానున్న బీఎస్-6 ఇంధన వాహనాలు మరో కారణం. బీఎస్-4 యూనిట్ల ఉత్పత్తి తగ్గడం వల్ల విక్రయాలు కూడా తగ్గాయని సంస్థ వివరించింది. గత నెలలో టీవీఎస్ మొత్తం 2,99,353 యూనిట్లను విక్రయించినట్టు చెప్పింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం డీలర్ స్థాయి నుంచే బీఎస్-4 యూనిట్లను తగ్గించినట్టు తెలిపింది. ఇక, మిగిలిన అన్ని వాహనాలను మార్చిలోపు విక్రయిస్తామని స్పష్టం చేసింది.

కరోనా వైరస్ కారణంగా విడి భాగాల తయారీపై తీవ్ర ప్రభావం ఉందని, ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టు టీవీఎస్ కంపెనీ వివరించింది. టీవీఎస్ ద్విచక్ర వాహనాలు గతేడాది ఇదే సమయంలో 2,85,611 యూనిట్లు అమ్ముడయ్యాయని, 2020 ఫిబ్రవరిలో 17.4 శాతం క్షీణించి 2,35,891 యూనిట్లకు తగ్గిందని సంస్థ ప్రకటించింది. దేశీయంగా చూసుకుంటే, 26.72 శాతం క్షీణించిందని, మోటార్ సైకిళ్లు 3.29 శాతం, స్కూటర్లు 30.25 శాతం తగ్గినట్ట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, ద్విచక్రవాహనాలతో పోల్చుకుంటే త్రీవీలర్ విక్రయాలు ఏకంగా 25 శాతం పెరగడం ఆశ్చర్యకరం. వీటితో పాటు ఎగుమతులు కూడా 25 శాతం పెరిగాయని టీవీఎస్ సంస్థ ప్రకటించింది.

Tags : TVS Motor sales, Two-Wheeler Sales fall, Coronavirus Outbreak, TVS Motor Components

Advertisement

Next Story

Most Viewed