- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీవీఎస్ అమ్మకాలు 22 శాతం వృద్ధి
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ అక్టోబర్ నెలకు సంబంధించి 22 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో 3,94,724 యూనిట్లను విక్రయించగా, గతేడాది ఇదే నెలలో కంపెనీ 3,23,368 యూనిట్లను విక్రయించినట్టు సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అక్టోబర్ నెలలో మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలు 24 శాతం వృద్ధి సాధించి 3,82,121 యూనిట్లు ఉండగా, గతేడాది 3,08,161 యూనిట్లుగా నమోదయ్యాయి.
దేశీయ అమ్మకాలు 19 శాతం పెరిగి 3,01,380 యూనిట్లు అమ్ముడవగా, గతేడాది ఇదే నెలలో 2,52,684 యూనిట్లను విక్రయించింది. మోటార్‌సైకిల్ అమ్మకాలు గత నెలలో 1,73,263 యూనిట్లు విక్రయించగా, గతేడాది ఇదే నెలలో 1,25,660 యూనిట్లతో పోలిస్తే 38 శాతం వృద్ధిని సాధించింది. స్కూటర్ అమ్మకాలు 5 శాతం పెరిగి 1,27,138 యూనిట్లకు చేరుకోగా, గతేడాది అక్టోబర్‌లో 1,21,437 యూనిట్లుగా నమోదైనట్టు కంపెనీ పేర్కొంది.
టీవీఎస్ మోటార్ త్రీ-వీలర్ అమ్మకాలు గత నెలలో 12,603 యూనిట్లకు తగ్గాయని, గతేడాది ఇదే కాలంలో 15,207 యూనిట్లు అమ్ముడైనట్టు కంపెనీ వెల్లడించింది. ఇక, ఎగుమతులు 33 శాతం పెరిగి 92,520 యూనిట్లకు చేరుకున్నాయని, గతేడాది ఇదే సమయంలో 69,339 యూనిట్లు విక్రయించినట్టు కంపెనీ తెలిపింది. ద్విచక్ర వాహనాల ఎగుమతులు 46 శాతం పెరిగి 80,741 యూనిట్లుగా ఉన్నాయని, గతేడాది ఇదే నెలలో 55,477 యూనిట్ల ఎగుమతులు జరిగినట్టు కంపెనీ పేర్కొంది.