- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీవీఎస్ నుంచి సరికొత్త అవెంజర్స్ స్కూటర్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద టూ-వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ మంగళవారం తన మార్వెల్స్ అవెంజర్స్ ప్రేరణతో తయారుచేసిన టీవీఎస్ ఎన్‌టీఆర్‌క్యూ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ. 77,865(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ)గా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది.
ప్రత్యేక సూపర్‌స్క్వాడ్ ఎడిషన్‌ను విడుదల చేసేందుకు టీవీఎస్ కంపెనీ డిస్నీ ఇండియాతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇరు కంపెనీల భాగస్వామ్యంలో భాగంగా టీవీఎస్ పలు వినియోగదారు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానుంది. స్పెషల్ ఎడిషన్ రూపంలో ప్రతి మార్వెల్ సూపర్ హీరో స్టైల్‌ను అనుకరిస్తూ కొత్త ఉత్పత్తుల రూపకల్పన చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది.
‘ప్రతి ఒక్కరం మన అభిమాన హీరోను ప్రేమిస్తాం. ఈ అనుబంధాన్ని వినియోగదారులు కూడా అనుభవించే అవకాశమిచ్చేందుకే తాము ఈ టీవీఎస్ ఎన్‌టీఆర్‌క్యూ 125 సూపర్‌స్క్వాడ్ ఎడిషన్‌ను పరిచయం చేస్తున్నాం. ఈ సరికొత్త స్కూటర్ వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్ తెలిపారు. ఈ మోడల్ స్కూటర్ ముందు భాగంలో సూపర్‌స్క్వాడ్ లోగో, ఐకానిక్ అవెంజర్స్ ‘ఎ’ ఉంటుంది. లెగ్ షీల్డ్, స్పీడో మీటర్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది 125 సిసి ఇంజిన్‌తో లభిస్తుందని కంపెనీ పేర్కొంది.