- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామ పంచాయతీలకు టీవీలు అందజేత
దిశ, తాండూరు: టీవీ లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి, కుల్కచర్ల మండలాల్లోని గ్రామ పంచాయితీలకు ఎంపీ రంజిత్ రెడ్డి తన సొంత నిధులతో టీవీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు అశోక్ వర్ధన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో డిజిటల్ తరగతుల కోసం టీవీలను ఉపయోగించుకోవాలని సర్పంచులకు సూచించారు. విద్యార్థులు శ్రద్ధగా ఆన్లైన్ తరగతులు వింటూ ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. జిల్లాలోని 18మండలాలతో కలిపి 500 వరకు గ్రామాలకు ఉచిత టీవీలు పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.