సమస్యలు పరిష్కరించాలని..జర్నలిస్టుల నిరసన

by Sridhar Babu |
సమస్యలు పరిష్కరించాలని..జర్నలిస్టుల నిరసన
X

దిశ‌, ఖ‌మ్మం: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్లూజే ఐజేయూ జర్నలిస్టు నాయకులు మంగళవారం ఖమ్మం జిల్లాలోని అమరవీరుల స్తూపం వద్ద నల్లమాస్కులు ధరించి నిరసన తెలిపారు.వివరాల్లోకివెళితే.. జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల్లో కరోనా కష్టకాలంలో తమను ఆదుకోవాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శనలు చేశారు.తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఆరేండ్లు పూర్తయినప్పటికీ జర్నలిస్టుల సమస్యలు నేటికి పరిష్కారం కాలేదన్నారు.ఈ నేపథ్యంలోనే బ్లాక్ కలర్ మాస్కులతో నిరసన వ్యక్తం చేసిన‌ట్లు టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. రాంనారాయణ వెల్లడించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ..ప్రత్యేక తెలంగాణ పోరాటంలో జర్నలిస్టులు ముఖ్య భూమికను ముఖ్య‌మంత్రి కేసీఆర్ గుర్తించాల‌న్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం జ‌ర్నలిస్టుల‌కు ఇచ్చిన హామీల‌ను వెంటనే నెర‌వేర్చాల‌ని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story