- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాట్ టాపిక్‌గా మారిన తుమ్మల వ్యాఖ్యలు.. నిజమేనా అంటున్న ప్రజలు.!
దిశ, పాలేరు : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, వారి వర్గీయుల మధ్య ఉప్పు.. నిప్పులా ఉంది పరిస్థితి. ఎప్పుడు ఎవరికి వారే ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. అయితే, పార్టీలో సీనియర్ నేతగా తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులను ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఆయన అనుచరులు ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తుమ్మల వర్గీయులపై అక్రమ కేసులు బనాయించడం, వారిపై దాడులకు దిగడం చేస్తున్నారు. దీంతో, నియోజకవర్గంలో పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయింది. అయితే, ఆధిపత్యం కోసం ముందు నుంచీ ప్రయత్నిస్తున్న కందాలకు పార్టీ పెద్దల నుంచి కూడా సపోర్ట్ ఉన్నట్లు తుమ్మల వర్గీయులే అంటున్నారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వర్గీయులు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే 2018 ఎన్నికల్లో కూడా కావాలనే తుమ్మలను ఓడించి ఆ తర్వాత కందాలను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి. అయితే, అప్పటి నుంచి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వర్గీయులు కొంత సైలెంట్‌గానే ఉంటున్నారు.
అయినా కందాల, తుమ్మల వర్గీయుల మధ్య ఎప్పడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కూడా మాజీ మంత్రి అనుచరులపై కావాలనే దాడులకు దిగడం, అక్రమ కేసులు పెట్టించి బనాయిస్తుండటంతో ఆందోళనలు కూడా చేశారు. ఇలా అయితే సహించేది లేదంటూ తుమ్మల సహా, ఆయన ముఖ్య అనుచరులు సీపీకి ఫిర్యాదు కూడా చేశారు.
అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్న తుమ్మల..
తాజాగా శుక్రవారం నేలకొండపల్లి పర్యటన సందర్భంగా మాజీ మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండలంలోని మంగాపురం తండాలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల గురించి గ్రామస్తులు ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. పాలేరులో గడిచిన మూడు సంవత్సరాలలో తాను మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేయించిన పనులు, ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులు తప్ప ఇప్పటివరకు ఒక్క పైసా పని కూడా మంజూరు కాలేదన్నారు.
సీఎం హామీతో 143 తండాలకు బీటీ రోడ్లు వేయించానన్నారు. అవకాశం ఉన్నంత వరకు ఏ సమస్యనైనా పరిష్కరిస్తానని, అధికారులతో చెప్పి అయినా చేయిస్తానంటూ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారాయి. తుమ్మల హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
వ్యాఖ్యల వెనుక అర్థమేమిటి..?
ఇప్పటికే పార్టీలో తనను తొక్కేశారనే భావన తుమ్మల, ఆయన అనుచరుల్లో ఉంది. అందుకే ఆయన ఎప్పటి నుంచో పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అడపాదడపా పర్యటనలు మినహా అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. అయితే, తన అనుచరులపై కందాల వర్గీయుల పెత్తనం ఇప్పుడు తలనొప్పిగా మారింది.
ఎన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరిగినా అధిష్టానం ఏం స్పందించకపోవడంతో కావాలనే ఇలా చేస్తున్నారనే నిర్ణయానికి వచ్చినట్లు తుమ్మల వర్గీయుల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాల పట్ల తుమ్మల సైతం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గతంలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.
ఒకనొక సందర్భంలో ఆయన బీజేపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరగడంతో తుమ్మల కొట్టిపారేశారు. మళ్లీ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన మాటలను బట్టి అసంతృప్తి సెగలు మళ్లీ బయటపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.