ఈ రాశి స్త్రీలు.. ఇలా చేస్తే జీవితం అద్భుతమే!

by Anukaran |
Panchangam
X

తేది : 29, జూన్ 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : జ్యేష్ఠమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పంచమి
(నిన్న మద్యాహ్నం 2 గం॥ 23 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 29 ని॥ వరకు)
నక్షత్రం : శతభిష
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 53 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 5 ని॥ వరకు)
యోగము : ప్రీతి
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు ఉదయం 8 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 44 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 25 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 14 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 55 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 14 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 18 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 56 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 1 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 39 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 44 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : కుంభము

మేష రాశి: అదృష్టం మీ వైపు ఉంది అన్నివిధాలా అనుకూలమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలు మీరే తీసుకోండి. దీర్ఘకాలంగా నడుస్తున్న కోర్టు కేసు మీకు అనుకూలం. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి మీ పిల్లల మనసులో ఏముందో కనుక్కోండి. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. ఆఫీసులో మీ పని సామర్ధ్యంపై అందరి ప్రశంసలు కొంతమంది ఉద్యోగులకు ప్రమోషన్. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలు మరిచిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు నడపండి.

వృషభ రాశి: కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న ఒత్తిడి మాయమవుతుంది. స్నేహితుల బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కంటి జబ్బులు రాకుండా జాగ్రత్తపడండి. ఇతరుల నుంచి బహుమానాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో మీ బడ్జెట్ గురించి మాట్లాడండి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క హాస్యచతుర సంభాషణ మిమ్మల్ని సంతోషపరుస్తుంది.

మిధున రాశి: ఆధ్యాత్మిక మార్గం మీద ఆసక్తి కనబరుస్తారు. సహనంతో ఆలోచించండి. అప్పులు చేయకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది. ఆఫీసులో మీ పని సామర్థ్యంపై అందరి ప్రశంసలు. దాని వలన మీకు మనోధైర్యం. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు. మీ భార్య భర్తలు చిన్న చిన్న విషయాలకు గొడవ పడకండి. ఆదాయం బాగుంది దుబారా ఖర్చులను నివారించండి. అధిక శ్రమ వలన కీళ్ల నొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరినొకరు తప్పులు పట్టుకోవటం మానేయండి.

కర్కాటక రాశి: స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక మార్గం మీద ఆసక్తి కనబరుస్తారు. దైవ ప్రార్ధన వలన మన బలం. ఎవరికీ తొందరపడి మాట ఇవ్వకండి మాట నిలబెట్టుకోవడం కష్టం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చెడు అలవాట్లను వదిలి వేయండి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి. వారితో గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. కుటుంబంలో పెద్దవారికి అనారోగ్యం వలన మానసిక అశాంతి. ఆఫీసు పనులలో నిర్లక్ష్యం వద్దు. జాగరూకతతో పని చేయండి. ఆదాయం బాగుంది పాతబాకీలు వసూలవుతాయి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలు మరిచిపోండి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

కన్యారాశి: ఎంతో కాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల నుంచి జాలిని ఆశించటం పిరికితనం తో సమానం. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆఫీసులో మీ పని సామర్ధ్యం పై అందరి ప్రశంసలు కొందరు ఉద్యోగులకు ప్రమోషన్ వ్యాపారస్తులకు వ్యాపారం లో కొత్త అవకాశాలు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. వారితో పరుషంగా మాట్లాడకండి. అనుకోని అతిథుల వలన ఇబ్బంది. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

సింహరాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. సంఘంలో పేరుప్రతిష్టలు. ఆఫీసు పనులను పెండింగ్ పెట్టకండి పై అధికారులతో మాటలు వస్తాయి. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలు కొద్దిగా దిగకండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు. వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహిస్తారు చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే డబ్బు, ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల వ్యవహారంలోకి మూడవ వ్యక్తిని రానీయకండి.

ధనస్సు రాశి: ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. బంధువులతో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సహోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇతరుల వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళకండి. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆఫీసు పనులను సకాలంలో చకచకా పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు పొందుతారు. కావల్సినంత డబ్బు చేతికందుతుంది పొదుపు చేస్తారు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరినొకరు తప్పులు పట్టుకోవడం మానేయండి.

వృశ్చిక రాశి: పట్టుదల ఆత్మవిశ్వాసం తో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ఆలోచించి తీసుకోండి. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది అనవసరపు దుబారా ఖర్చులను నివారించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆఫీసు పనులను జాగ్రత్తగా చేయండి లేకుంటే అనవసరపు తప్పిదాలు జరిగే అవకాశం. మీ కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి. వారు హర్ట్ అయ్యే అవకాశం. అధిక శ్రమ వల్ల మోకాళ్ల నొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొరటుతనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

తులారాశి: కోపతాపాలను, గందరగోళంను వదిలివేయండి. లేకుంటే భార్యాభర్తల మధ్య గొడవల కు అవకాశం. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయాలి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి. అనవసరపు విషయాల గురించి ఆలోచించడం వలన సమయం వృధా. సరైన పథకాల లో పెట్టుబడులు పెట్టండి లేకుంటే డబ్బు నష్టం. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మానసిక అశాంతి.

మకర రాశి: అవసరం లేని విషయాలను గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. మెడిటేషన్ వలన పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. మీరంటే పడని వారి మీద ఒక కన్ను వేసి ఉంచండి. మీ నుంచి ఏదో ఆశించే బంధువులను దూరం పెట్టండి. ఆఫీసు పనులను జాగ్రత్తగా చెయ్యండి లేకుంటే అనవసరపు తప్పిదాలు జరిగే అవకాశం. ఒత్తిడిని అధిగమించండి. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా మెలగండి. దాని వలన మీ బంధాలు మరింత గట్టిపడతాయి. ఆదాయం పరవాలేదు. అనుకోని ఖర్చుల వల్ల డబ్బు ఇబ్బంది. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

కుంభరాశి: ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. దైవ ధ్యానం వలన మన బలం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీ భార్య నుంచి కావలసినంత సహాయం లభిస్తుంది. చెడు అలవాట్లను వదిలి వేయండి. బంగారు నగలు కొంటారు. ఆఫీసు పనుల్లో అధిక శ్రమ. ఆదాయం పర్వాలేదు అనవసర ఖర్చులు నివారించండి ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెట్టుకోండి ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోండి.

మీన రాశి: ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. నిరాశావాదం వదిలిపెట్టండి. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. దీర్ఘకాలంలో లాభాలు రావాలంటే సరైన పథకాల్లో పెట్టుబడులు పెట్టండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి వారితో పరుషంగా మాట్లాడకండి. వారు హర్ట్ అయ్యే అవకాశం. ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి కావాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. బంధువుల నుంచి అందిన ఒక చెడు వార్త వలన మానసిక అశాంతి. అవసరాల కోసం అధికంగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కంటి జబ్బులకు అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క మొరటుతనం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

Advertisement

Next Story