- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ డైనోసార్ డీఎన్ఏ దొరికితే అమరత్వం గ్యారంటీ!
సోషియో ఫాంటసీ సినిమాల్లో.. అమరత్వం పొంది ప్రపంచాన్ని ఏలాలని ప్రయత్నిస్తున్న విలన్‌ను హీరో అడ్డుకుంటుంటాడు. అలా హీరోలు, విలన్‌లు ఉండాలంటే ముందు అమరత్వం అనే కాన్సెప్ట్ ఉండాలి. అభివృద్ధి పేరుతో ప్రకృతికి హాని కలిగిస్తూ 100 ఏళ్ల జీవితకాలాన్ని, 70 ఏళ్లకు కుదించుకున్నాడు మానవుడు. ఇక ఇలాంటి సమయాల్లో అమరత్వం సంగతి గురించి ఆలోచించడం కూడా వృథా అని అనుకుంటున్నారు కదా.. కానీ ఇటీవల న్యూజిలాండ్‌లోని ఒటాగో యూనివర్సిటీలో చేసిన కొన్ని పరిశోధనల్లో అమరత్వానికి దారి దొరికింది. అయితే దీన్ని పొందాలంటే ముందు ‘టువాటారా’ అనే డైనోసార్ అవశేషాల జాడ దొరకాలి. ఎందుకంటారా?
‘టువాటారా’ అనే ఈ డైనోసార్ 250 మిలియన్ సంవత్సరాల క్రితం భూమ్మీద ఉండేది. ప్రస్తుతం ఉన్న టువాటారాలకు ఇది పితృదేవత లాంటిదన్నమాట. గోండ్వానాలోని యాంటేడైలువియన్ ఖండంలో రైనోసిఫేలియా జాతి జంతువులతో పాటు ఇది సంచరించేది. అప్పుడు నివసించి ఉన్న డైనోసార్లలో ఇది చాలా ప్రత్యేకమైనది. దీని జీనోమ్‌లో ఉన్న జన్యువులు పాములు, తొండలు వంటి సరీసృపాల జన్యువులతోనూ, అలాగే క్షీరదాల జన్యువులతోనూ పోలి ఉన్నాయని పరిశోధనల్లో తేలినట్లు ప్రొఫెసర్ నీల్ గెమ్మెల్ చెప్పారు. దీని జీనోమ్‌లో భూమ్మీద ఎక్కువ కాలం జీవించగల తాబేలు జన్యువు జాడలు కూడా ఉన్నాయని తేలినట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి, ఉష్ణోగ్రత నియంత్రణ, చెడు వాసనల గుర్తింపు, వేగవంతమైన జీవక్రియరేటు కోసం ప్రత్యేకించిన జన్యుక్రమాలను దీనిలో గుర్తించినట్లు నీల్ వివరించారు. కాబట్టి ఈ టువాటారాకు సంబంధించి పురాతన కాలం నాటి ఏదైనా ఒక్క అవశేషాన్ని సంపాదించినా, దాని జన్యువును పునఃసృష్టించి మానవులకు అమరత్వం ప్రసాదించే అవకాశం కూడా ఉందని నీల్ వెల్లడించారు. కాబట్టి ఈ జన్యువును బలంగా పునఃసృష్టించగలిగితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయని నీల్ చెబుతున్నారు.