టీటీడీ సంచలన నిర్ణయం

by srinivas |   ( Updated:2021-04-03 01:02:56.0  )
టీటీడీ సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రిటైర్డ్ అర్చకులకు సంబంధించి టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. వయో పరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటు ఇతర అర్చకులు కూడా విధుల్లో చేరాలంటూ ఆదేశించింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. తాజా ఆదేశాలతో తిరిగి ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు ఆలయ ప్రవేశం చేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు కొనసాగడంపై సందిగ్దత నెలకొంది.

Advertisement

Next Story