ఏపీ గవర్నర్ ను కలిసి అతి ముఖ్యమైన పదార్థాన్ని అందజేసిన టీటీడీ చైర్మన్

by srinivas |   ( Updated:2021-11-02 02:33:22.0  )
AP-Governar1
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన తిరుమల శ్రీవారి ప్రసాదం, 2022 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్, డైరీలను అందజేశారు. కరోనా నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన చర్యలు, ప్రస్తుతం భక్తులను అనుమతిస్తున్న విధి విధానాలను గురించి గవర్నర్‌కు సుబ్బారెడ్డి వివరించారు. కొవిడ్ నేపథ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story