YV Subba Reddy: వారికి ఏదైనా అయితే ఎవరిది బాధ్యత : టీటీడీ చైర్మన్

by srinivas |   ( Updated:2021-05-24 21:58:16.0  )
YV Subba Reddy: వారికి ఏదైనా అయితే ఎవరిది బాధ్యత : టీటీడీ చైర్మన్
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాకు చెందిన కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య ఆయుర్వేద వైద్యంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనందయ్య మందు వాడొచ్చు అని నిర్ధారించాల్సింది కేంద్ర ఆయుష్ డిపార్ట్మెంట్ అని, ‘‘అధ్యయనం చెయ్యకుండా పంపిణీ చేస్తే ఎవరికైనా ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు..? ప్రశ్నించారు. తెలంగాణలో కూర్చుని ఏపీపై విమర్శలు చేయడం చంద్రబాబుకు తగదని అన్నారు. ఇది అల్లోపతి కాదు కనుక ఐసీఎమ్‌ఆర్ ఆయుష్ డిపార్ట్మెంట్‌కు ఇచ్చిందన్నారు. అధ్యయనం చేసి రిపోర్ట్ పంపాలని ఆదేశాలు వచ్చాయని అన్నారు. టీటీడీ ఆయుర్వేదిక్ కాలేజి ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ప్రొఫైసర్లు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ కూడా చేయాలని సూచన చేశారని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అధ్యయనం పూర్తి అయ్యాక కేంద్ర ఆయుష్ శాఖ నివేదిక పంపుతామన్నారు. అనంతరం ఆయుష్ నుండి అనుమతులు వస్తే టీటీడీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed