CAG ఆడిట్‌కు TTD అంగీకారం..

by Anukaran |
CAG ఆడిట్‌కు TTD అంగీకారం..
X

దిశ, వెబ్‌డెస్క్ : టీడీడీ పాలకమండలి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేండ్ల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆదాయ, వ్యాయాలను కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (CAG) ద్వారా విచారణ జరిపించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, సత్యపాల్ సబర్వాల్ ఇద్దరూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై వివరణ కోరగా.. కాగ్‌తో విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని టీటీడీ బోర్డు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ విషయంపై టీటీడీ పాలకమండలి బోర్డు ప్రభుత్వానికి సిఫారసు చేయగా సీఎం జగన్ కూడా అంగీకరించిట్లు తెలుస్తోంది.

కాగా, టీటీడీలో జరుగుతున్న ఆడిట్ పై పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో పాలకమండలి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, గత 2014 నుంచి ‘స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్’ టీటీడీ ఆదాయ, వ్యయ ఖర్చులను లెక్కిస్తోంది.

Advertisement

Next Story