వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా

by Sumithra |   ( Updated:2021-11-12 05:15:40.0  )
TSRTC bus
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మర్పల్లి మండలం కల్కొడ వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. సంగారెడ్డి నుంచి తాండూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. కల్కొడ గ్రామం సమీపంలో రహదారి ఎత్తుపల్లాలను డ్రైవర్ అంచనా వేయలేకపోయాడు. అప్పటికే వేగంలో ఉన్న బస్సును కంట్రోల్ చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకుపోయి బోల్తా పడింది. ప్రయాణికుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story