రేవంత్ రెడ్డికి ఉచ్చుబిగిస్తున్న సర్కార్..

by Shyam |   ( Updated:2021-08-13 00:56:36.0  )
Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలంగాణ సర్కార్ ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దళిత దండోరా పేరుతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నంలో దళిత దండోరా మహాసభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

అయితే, కొన్ని భద్రతా పరమైన కారణాలతో అనుమతి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక సభా ప్రాంగణాన్ని ఔటర్ రింగు రోడ్డు వద్ద నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించగా.. పోలీసులు పలు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కాంగ్రెస్ పార్టీపై కక్ష్య గట్టి సభలకు అనుమతి ఇవ్వడం లేదని ఆ పార్టీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story