మెరుగైన జీవన ప్రమాణాల కోసమే ట్విన్ టవర్స్ : కేటీఆర్

by Sumithra |
మెరుగైన జీవన ప్రమాణాల కోసమే ట్విన్ టవర్స్ : కేటీఆర్
X

దిశ, క్రైమ్ బ్యూరో : భాగ్యనగర వాసులకు అత్యంత మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు ట్విన్ టవర్స్ ఎంతగానో ఉపయోగపడుతాయని ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. బంజారాహిల్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మంగళవారం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్‌లు సందర్శించారు. అనంతరం ట్విన్ టవర్స్‌లోని 14వ అంతస్తు నిర్మాణ పనులను మంత్రులు పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ట్విన్ టవర్స్ హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలుస్తున్నాయన్నారు. నగరంలో నేరాలు, ట్రాఫిక్ అంశాలను పరిశీలిస్తూ ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలను కల్పించేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతాయన్నారు. మరో మూడు నెలల్లో ఈ ట్విన్ టవర్స్ అందుబాటులోకి రానున్నాయని వివరించారు.కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed