మద్యం ధరల సవరణ ఎందుకంటే….

by Shyam |
మద్యం ధరల సవరణ ఎందుకంటే….
X

దిశ వెబ్ డెస్క్: మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకే మద్యం ధరల సవరణ చేపట్టామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ అన్నారు. మద్యం వినియోగంలో 90 శాతం తక్కువ రకం బ్రాండ్లే ఉంటాయని అన్నారు. అందుకే తక్కువ రకం బ్రాండ్ల రేట్లను విపరీతంగా తగ్గించినట్టు తెలిపారు. ఇక మద్యం రేట్లు ఎక్కువగా ఉండటంతో ఇటీవల చాలా మంది శానిటైజర్లు, ఆల్కహాల్ తాగుతున్నారని అన్నారు. దీంతో వారు ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మద్యం ధరలు సవరణ చేశామన్నారు.

తెలంగాణతో పోలిస్తే ఏపీలో వీటి ధరలు తక్కువగా ఉన్నాయని అన్నారు. దీంతో తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా గణనీయంగా తగ్గనున్నట్టు తెలిపారు. సవరించిన ధరలు నేటి నుంచే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా మద్యం అక్రమ రవాణాతో పాటు, ఆల్కహాల్ సేవిస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలను అరికట్టేందుకు మద్యం ధరలు సవరించాలని ప్రభుత్వాన్ని ఎస్ఈబీ కోరింది. దీంతో ఎస్ఈబీ సిఫార్సుల మేరకు మద్యం ధరల సవరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారి చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story