- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అందరికి నమస్కారం అంటూ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. 60 ఏళ్ల పోరాటం ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని గవర్నర్ అన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాట పడుతోందన్నారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ ఎన్నో రంగాలలో పురోగతి సాధించిందని గవర్నర్ అన్నారు. ‘ సంక్షేమ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఒంటరి మహిళలకు సైతం ఆసరా పింఛన్లు ఇస్తున్నాం. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో విద్య, వైద్యం, సాగునీటి రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. రైతు ఆత్మహత్యలను నివారించాం. పిల్లలకు మెరుగైన విద్యా కోసం 950పైగా రెసిడెన్షియల్ పాఠశాలలను నడిపిస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, రూపాయికే కిలో బియ్యం వంటి పథకాలను అమలు చేస్తున్నాం. నాయీ బ్రహ్మణులు, చేనేత కార్మికులను ఆదుకున్నాం’ అంటూ గవర్నర్ తన ప్రసంగంలో తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
Tags: budget session, ap assembly, governor, speech