- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS Government: ప్రైవేట్ ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం షాక్
దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. అధిక ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలు పాటించని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదర్ గూడ అపోలో, కూకట్‌పల్లిలోని ఓమ్ని, సికింద్రాబాద్ కిమ్స్, బోయినపల్లిలోని రాఘవేంద్ర ఆస్పత్రులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే వరంగల్ జిల్లాలోని ఆద్య కిడ్స్, సెవెన్ హిల్స్, అపెక్స్, డా.రాజూస్ ENT, విజయ్ ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులిచ్చారు. ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లో పలు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు కూడా నోటీసులిచ్చారు.
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి చెక్ పెడతామని, ఆస్పత్రులపై చర్యలకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 64 ఆస్పత్రులపై 88 నోటీసులు జారీ చేశామని, ఆస్పత్రుల బిల్లులపై నిఘా పెట్టామన్నారు. అవసరమైతే లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామన్నారు.