- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్‌బ్రేకింగ్.. ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విద్యాశాఖ కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం కరోనా కారణంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసి సెకండ్ ఇయర్‌కి ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా అదుపులో ఉండటంతో తిరిగి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో ఈనెల 25 వ, తేదీ నుంచి ఇంటర్ మొదటి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 70 శాతం సిలబస్‌తో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, విద్యార్థులు మరింత సులభతరంగా పరీక్షలు రాసేందుకు.. ప్రశ్నల్లో మరిన్ని ఆప్షన్లు పెంచినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన నమూనా ప్రశ్నా పత్రాలు tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఉన్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ కూడా అందుబాటులో ఉన్నట్టు జలీల్ తెలిపారు. విద్యార్థుల కెరీర్ కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు.