4న సోషల్ టాలెంట్ టెస్ట్

by Naveena |   ( Updated:2025-01-01 16:10:31.0  )
4న సోషల్ టాలెంట్ టెస్ట్
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఈ నెల 4న జిల్లా స్థాయిలోని పదవ తరగతి విద్యార్థులకు సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక శాస్త్రం ఫోరం అధ్యక్ష,కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్,విష్ణువర్ధన్ గౌడ్ లు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ,జిల్లా పరిషత్,కేజీబీవీ,మోడల్ స్కూల్స్,గురుకుల పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు తెలుగు,ఇంగ్లీష్ మీడియం వారిగా ఇద్దరి చొప్పున పరీక్షకు హాజరు కావచ్చని వారు వివరించారు.పరీక్ష స్థానిక గాయత్రీ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10-30 నుంచి 12-30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు,పూర్తి వివరాలకు 9441302084,9948731533 నెంబర్లను సంప్రదించగలరని వారు తెలిపారు.

Advertisement

Next Story