- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఉద్యోగులకు సూపర్ న్యూస్.. రుణాలు ఇప్పించేందుకు సర్కార్ సై
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ రుణాల బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై ఉద్యోగ సంఘాలు సోమవారం సీఎస్ సోమేశ్‌కుమార్‌తో బీఆర్కే భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాలుగు ప్రధానాంశాలపై చర్చించారు.
కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంతమందికి కరోనా సోకడంతో ఇబ్బందులు వచ్చాయని ఈ సందర్భంగా వివరించారు. దీనికోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పటించేందుకు అంగీకరించారు. అయితే బ్యాంకులు కొన్నిచోట్ల ఉద్యోగులకు లోన్లు ఇచ్చేందుకు సతాయిస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికోసం జిల్లా కలెక్టర్లకు స్పెషల్ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు సీఎస్ వెల్లడించారు. ఉద్యోగులకు సంబంధించిన రుణాలు ఇప్పించేందుకు కలెక్టర్లు… బ్యాంకర్లతో సమావేశమవుతారన్నారు. అదే విధంగా కరోనా కాలంలో ఉద్యోగులకు వాహన రుణాలు ఇప్పించేందుకు కూడా అనుమతిచ్చారు. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవారికి కరోనా సోకుతుందనే కారణాల నేపథ్యంలో వారికి వాహనాల కోసం రుణాలివ్వనున్నారు.
క్యాష్‌లెస్ ట్రీట్మెంట్
ఇక ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న క్యాష్‌లెస్ ట్రీట్మెంట్కు ప్రభుత్వం తరపున అంగీకరించారు. ఉద్యోగుల మూల వేతనం నుంచి 1 శాతం వేతనాన్ని మినహాయించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు త్వరలోనే అనుమతిస్తామని ఉద్యోగ సంఘాలకు సీఎస్ హామీ ఇచ్చారు. ఏపీలో పని చేస్తున్న మిగిలిన ఉద్యోగులను త్వరలోనే రాష్ట్రానికి తీసుకువస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
సీఎస్‌తో సమావేశమైన వారిలో టీఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, టీజీఓ అధ్యక్ష, కార్యదర్శులు మమత, ఏనుగుల సత్యనారాయణ, ప్రతినిధులు రవీంద్ర కుమార్, గండూరి వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణ యాదవ్, ముజీబ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులున్నారు.