- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్ సమావేశాలకు సమాయత్తం
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ‘తమిళి సై సౌందర్ రాజన్’ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో ఆమె తొలి ప్రసంగం చేయనున్నారు. ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత అన్ని పార్టీల ప్రతినిధులతో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమై అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ఈనెల 8న రానున్న ఆర్థిక సంవత్సరానికి మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కూడా ఇదే తొలిసారి. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించకుండా స్పీకర్, మండలి ఛైర్మన్, అసెంబ్లీ కార్యదర్శి తదితరులంతా ఇప్పటికే సమావేశమై తగు చర్యలు తీసుకున్నారు.పోలీసు బందోబస్తుపై లోతుగా చర్చించినట్టు సమాచారం.
గతేడాది ఆర్థిక మాంద్యం కారణంగా గణనీయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పొదుపు మంత్రంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ సారి కూడా అదే తరహా అనగా గతేడాది కంటే బడ్జెట్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చన్నది ఆర్థికశాఖ వర్గాల సమాచారం. 10శాతం కంటే బడ్జెట్ సైజులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమిళిసై సౌందర్‌రాజన్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రశంసలు కురిపించారు. ఆ అంశాన్నికూడా తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. దేశమంతా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధి, జీఎస్టీ పన్నువసూళ్ళలో తెలంగాణ పురోగతి సాధించింది. ఈ విషయంలో ప్రభుత్వం కనబరిచిన దూరదృష్టిని గవర్నర్ మెచ్చుకునే అశకాశం ఉంది.
tags ; Telangana, Budget, Assembly, Governor, speech, Harish Rao