కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేశా.. వైసీపీ ఎమ్మెల్యే ఎందుకు రాలేదు?

by srinivas |   ( Updated:2021-08-10 06:18:22.0  )
Kanipakam temple
X

దిశ, ఏపీ బ్యూరో: టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు విషయంలో కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, బీజేపీ నేత విష్ణు ప్రసాద్‌రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం దేవుడిగుడిలో ప్రమాణ స్వీకారం చేసేవరకు వెళ్లింది. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు చేసిన ఆరోపణలపై విష్ణువర్థన్ రెడ్డి కాణిపాకంలో సత్యప్రమాణం చేశారు. ఇకపోతే విగ్రహం ఏర్పాటు విషయంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డిల మధ్య నెలకొన్న రాజకీయ పోరు వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్లింది.

విష్ణువర్థన్‌రెడ్డి పెద్ద దొంగ అని, పుట్టపర్తి ఆశ్రమంలో డబ్బు, బంగారం దోచేశారని ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు. రాచమల్లు ఆరోపణలపై బీజేపీ నేత విష్ణువర్థన్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాచమల్లు ఆరోపణలపై తనకు సంబంధం లేదని తాను కాణిపాకంలో సత్యప్రమాణం చేస్తానని.. ఎమ్మెల్యే రాచమల్లు కూడా రావాలని విష్ణు సవాల్ చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కాణిపాకం రావాలని కోరారు. అయితే చెప్పినట్టుగానే విష్ణువర్థన్‌ రెడ్డి మంగళవారం కాణిపాకం ఆలయానికి వచ్చారు. కాసేపు వెయిట్ చేశారు.

ఎమ్మెల్యే రాచమల్లు రాకపోవడంతో కాణిపాకం వచ్చి దేవుని సన్నిధిలో సత్యప్రమాణం చేసినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సత్య ప్రమాణం చేసేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అంటే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అవినీతి, హత్యారాజకీయాలు చేస్తున్నట్టు అంగీకరించినట్టే కదా? అని విష్ణు ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed