కౌంటింగ్‌పై కోర్టుకెక్కుతా -ట్రంప్

by Anukaran |
కౌంటింగ్‌పై కోర్టుకెక్కుతా -ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్ : ఫలితాల్లో కీలకపాత్ర పోషించే రాష్ట్రాల్లో కౌంటింగ్‌ను దీర్ఘకాలం చేపడితే న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతారని ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లిక్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఎన్నికల రోజే విజయాన్ని ప్రకటించే నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కానీ, ఎన్నికలు ముగిశాక తర్వాతి రోజు కూడా బ్యాలెట్‌లను స్వీకరించడాన్ని ఉపేక్షించబోరని అన్నారు. ఎన్నికల ముగిసన తర్వాత మూడు రోజుల దాకా ఓట్ల లెక్కింపునకు పెన్సిల్వేనియాకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చిన విషయాన్ని పరోక్షంగా ఉటంకించారు. ఈ మినహాయింపును దుర్వినియోగం చేసే ప్రమాదమున్నదని తెలిపారు.

డెమొక్రాట్ గవర్నర్లున్న పెన్సిల్వేనియా, నెవాడా రాష్ట్రాల్లో ఈ మినహాయింపుతో ఫ్రాడ్ జరిగే ముప్పు ఉన్నదని హెచ్చరించారు. ఈ రెండు రాష్ట్రాలు స్వింగ్ స్టేట్‌లుగా భావిస్తున్నారు. అందుకే, ఎన్నికలు ముగియగానే తన లాయర్లతో న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతాయరని చెప్పారు. సాధారణంగా పెన్సిల్వేనియాలాంటి రాష్ట్రాలు ఫిజికల్ ఓటింగ్‌లో తొలుత రిపబ్లికన్‌లకు ఆధిక్యత చూపించి మెయిల్ బ్యాలెట్‌ల కౌంటింగ్‌లు వచ్చేసరికి డెమోక్రాట్లకు ఆధిక్యతను కట్టబెట్టాయి. అందుకే, ఓటింగ్ ముగిసిన తర్వాత రోజుల పాటు కౌంటింగ్ నిర్వహించడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు.

Advertisement

Next Story