'కిమ్ బాగానే ఉన్నారు.. అవన్నీ తప్పుడు వార్తలు'

by vinod kumar |
కిమ్ బాగానే ఉన్నారు.. అవన్నీ తప్పుడు వార్తలు
X

ఉత్తర కొరియా అధ్యక్షుడు, సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ మరణ శయ్యపై ఉన్నారని.. ఒక శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్యం విషమించి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఈ వార్తపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్యంపై వచ్చిన వార్తలు తప్పుడు సమాచారమేనని తాను భావిస్తున్నట్లు చెప్పారు. తప్పుడు నివేదికల ఆధారంగా సీఎన్ఎన్ న్యూస్ చానల్ ఈ అబద్దపు వార్తలు ప్రసారం చేసిందని ఆయన గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుర్తు తెలియని అమెరికా అధికారిని ఉటంకిస్తూ సీఎన్ఎన్ వార్త ప్రసారం చేసింది. ఆయన ఆరోగ్యంపై శ్వేతసౌధం నిఘా పెట్టిందని కూడా చెప్పింది. ఈ విషయాలే ట్రంప్ ఆగ్రహానికి కారణమయ్యాయి. ట్రంప్ మొదటి నుంచి సీఎన్ఎన్ సంస్థపై నిప్పులు చెరుగుతూనే ఉంటారు. తాజాగా కిమ్ విషయంలో కూడా సీఎన్ఎన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. కాగా, మరి ఇప్పుడు కిమ్ ఆరోగ్యం ఎలా ఉంది.. ఆయన బాగానే ఉన్నారా అని ట్రంప్‌ను ప్రశ్నించగా జవాబును దాటవేశారు.

Tags: Donald Trump, South Korea, Kim Jong Un, Health, CNN News, White House

Advertisement

Next Story