మాస్కులు మీరు పెట్టుకోండి.. నాకొద్దు : ట్రంప్

by vinod kumar |
Trump
X

వాషింగ్టన్ : కరోనా వైరస్ నుంచి స్వీయ రక్షణ కోసం పౌరులు మాస్కులు, ఇతర రక్షణ ఉత్పత్తులు ధరించాలని అమెరికా ప్రభుత్వం రూపొందించిన సూచనలను ప్రజలకు వివరిస్తూ తాను మాత్రం వాటికి అతీతుడన్నట్టుగా వ్యవహరించారు. ఆ సూచనలను తాను మాత్రం పాటించబోనని వివరించారు. ప్రజలు మాస్కులు తప్పక ధరించాలని చెబుతూనే తాను మాత్రం మాస్క్ పెట్టుకొని అప్పుడే చెప్పారు. కరోనా వైరస్ అమెరికాను కుదిపేస్తుండడంతో ట్రంప్ సర్కారు నియంత్రణ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే శుక్రవారం కొన్ని సూచనలు చేసింది. ఫెడరల్ సూచనలు వివరిస్తూ పౌరులు బయటికెళ్లేటప్పుడు మాస్కులు, స్కార్ఫ్ లు, ప్రత్యేకించిన టీ షర్ట్ లు తప్పక ధరించాలని చెప్పారు. వెంటనే ఇవి సూచనలు.. వారు అలా సూచిస్తుంటారు.. కానీ నేను మాత్రం మాస్కు ధరించబోపోవడం లేదని అన్నారు. ఓవల్ ఆఫీసులో కూర్చుని ప్రపంచ నేతలతో మాట్లాడుతున్నప్పుడు మాస్క్ పెట్టుకోవాలని నేను కోరుకోవడం లేదని తెలిపారు.

Tags: Trump, America. Masks, exempted, guidelines, won’t

Advertisement

Next Story

Most Viewed