- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పదేళ్ల తెలుగు బాలికను సత్కరించిన ట్రంప్
దిశ, ఏపీ బ్యూరో: పదేళ్ల తెలుగు బాలికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధానికి ఆహ్వానించి, సత్కరించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలో ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్న గుంటూరుకు చెందిన అన్నపరెడ్డి విజయ్‌రెడ్డి, బాపట్ల దగ్గర్లోని నరసయ్య పాలెంకు చెందిన శ్రావ్య దంపతులకు అన్నపరెడ్డి శ్రావ్య (10) కుమార్తె…
అమెరికాలోని హనోవర్‌లో నాలుగో తరగతి చదువుతున్న శ్రావ్య… మేరీలాండ్‌లో ఎల్క్‌రిడ్జ్‌లోని ట్రూప్ 744లో లైలా ఖాన్, లారెన్ మాట్నీతో కలిసి సభ్యురాలిగా కొనసాగుతోన్నది. ఈ ముగ్గురూ కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది సేవలకు మద్దతు తెలుపుతూ, వారి సేవలను కొనియాడుతూ వ్యక్తిగత కార్డులను పంపారు. అంతే కాకుండా, 100 బాక్స్‌ల గర్ల్స్ స్కౌట్స్ కుకీస్‌ను స్థానిక అగ్నిమాపక, వైద్య సిబ్బందికి పంపారు.
దీంతో శ్వేతసౌధంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ ముగ్గురు బాలికలను ప్రెసిడెంట్ ట్రంప్ శ్వేతసౌధానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా శ్రావ్య మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు తనకు భారతీయ సంస్కృతులను నేర్పుతూ పెంచారని చెప్పింది. వసుదైక కుటుంబం సిద్ధాంతాన్ని నమ్ముతానని తెలిపి ఆశ్చర్యపరిచింది.