- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో దేశీయ ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్
అమెరికాలో కరోనా విలయం కొనసాగుతున్నా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశీయంగా ప్రయాణాలకు అనుమతి ఇస్తున్నట్లు బుధవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వచ్చే వారం నుంచి రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండ త్వరలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనబోతున్నట్లు తెలిపారు. దాదాపు 25 వేల మందితో భారీ సభ నిర్వహించే యోచనలో ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. వచ్చేవారంలో అరిజోనా రాష్ట్రంలో పర్యటించబోతున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఈ పర్యటనకు ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని.. ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడానికేనని ట్రంప్ అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మహమ్మారి దానికదే పోతుందని, వ్యాక్సిన్‌పై ఆధారపడడం లేదన్నారు. త్వరలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Tags: america, trump, travel, green signal