ఆస్పత్రి నుంచి ట్రంప్ డిశ్చార్జ్

by Anukaran |   ( Updated:2020-10-05 21:20:33.0  )
ఆస్పత్రి నుంచి ట్రంప్ డిశ్చార్జ్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ దంపతులు ఇటీవల కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా సోకడంతో ట్రంప్ వాల్టర్ రీడ్ సైనిక ఆస్పత్రిలో చేరి మూడ్రోజుల పాటు చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన వైట్‌హౌస్‌లో ఉండి, మరో వారంరోజుల పాటు చికిత్స తీసుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేగాకుండా కరోనా సోకిన రోగులు ఎవరూ భయపడొద్దని, ధైర్యంగా ఉంటే వెంటనే కోలుకోవచ్చని సూచించారు. మన జీవితంపై ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం కరోనాకు ఇవ్వొద్దని తెలిపారు. తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. కాగా ఇటీవల ట్రంప్ ఆరోగ్యం విషయమంగా ఉన్నట్టు, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విసయం తెలిసిందే.

Advertisement

Next Story