స్రవంతి చరిత్ర మాకు తెలుసు.. టీఆర్ఎస్ మహిళా నేతల సంచలన వ్యాఖ్యలు

by Shyam |
TRS women leaders
X

దిశ, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి ఇటీవల ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు ఖండించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ నేత స్రవంతిరెడ్డి వ్యక్తిగత జీవితం ఏంటో తమకు తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాటి మహిళ అన్న ఒకే ఒక్క కారణంతో తాము ఆమెను పట్టించుకోవడం లేదన్నారు. ఆమె స్రవంతిగా కంటే ఢిల్లీ స్రవంతిగానే ప్రజలకు బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. స్థాయిని మరిచి ఎమ్మెల్యేను విమర్శిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ రాసిచ్చిన స్ర్కిప్టు చదవడం కాదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో బొంకన్‌పల్లి సర్పంచ్ పద్మావతి, ఎంపీటీసీ పూజిత, మాక్లూర్ ఉప సర్పంచ్ అనిత, ఎంపీటీసీ మీరాబాయి, మాదాపూర్ ఎంపీటీసీ లలిత తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed