టికెట్‌కు రూ.50ల‌క్ష‌లు అడుగుతున్న‌రు.. బిల్డింగ్ ఎక్కిన టీఆర్ఎస్ మ‌హిళా నేత‌

by Anukaran |   ( Updated:2021-04-21 22:08:22.0  )
టికెట్‌కు రూ.50ల‌క్ష‌లు అడుగుతున్న‌రు.. బిల్డింగ్ ఎక్కిన టీఆర్ఎస్ మ‌హిళా నేత‌
X

దిశ ప్రతినిధి, వరంగ‌ల్ : టీఆర్ఎస్ పార్టీలో నిర‌స‌నల సెగలు ఎగిసిప‌డుతున్నాయి. టిక్కెట్ ద‌క్కనివాళ్లు… ద‌క్కద‌ని అప‌న‌మ్మకం ఏర్పడిన నేత‌లు సెల్ ట‌వ‌ర్లు, బిల్డింగ్‌లు ఎక్కి త‌మ‌కు టికెట్ ప్రక‌టించి బీఫారంలు అంద‌జేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. బుధ‌వారం సాయంత్రం ద‌ర్శన్‌సింగ్ అనే టీఆర్ ఎస్ నాయ‌కుడు ఉద్యమ‌కాలం నుంచి పార్టీలో ప‌నిచేస్తున్న త‌న‌కు పార్టీ టికెట్ కేటాయించ‌డం లేద‌ని ఆవేద‌న చెందుతూ హ‌న్మకొండలోని బీఎస్ ఎన్ ఎల్ ట‌వ‌ర్ ఎక్కి నాలుగు గంట‌ల పా హై టెన్షన్ సృష్టించాడు. పోలీసులు, టీఆర్ ఎస్ నేత‌ల నిర్విరామంగా శ్రమించి టికెట్ వ‌చ్చేలా చేస్తామ‌ని పార్టీ పెద్దల నుంచి హామీ వ‌చ్చాకా నాలుగు గంటల త‌ర్వాత రాత్రి 8గంట‌ల స‌మ‌యంలో కింద‌కి దిగాడు. తాజాగా వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన తుమ్మల శోభారాణి అనే మ‌హిళా నాయ‌కురాలు 58వ డివిజన్ జనరల్ మహిళ కు రిజర్వేషన్ కావడంతో తనకే టికెట్ కేటాయించాలని అదాలత్ సెంటర్ లో ఉన్న ఓ ప్రైవేట్ కాంప్లెక్స్ ఎక్కి పెట్రోల్ బాటిల్ తో నిరసన వ్యక్తం చేస్తోంది. ఉద్యమకాలం నుంచి పార్టీలో ప‌నిచేస్తున్న న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తోంది. తాజా ప‌రిస్థితుల‌తో పార్టీ పెద్దలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. బీఫారంలు అంద‌జేసేందుకు నేడే చివ‌రి రోజు కావ‌డంతో నామినేష‌న్లు వేసిన అభ్యర్థులు పార్టీ బీఫారం కోసం ప‌ట్టుబ‌డుతున్నారు.

50ల‌క్ష‌లు డిమాండ్ చేస్తున్నరు…

శోభారాణి గ‌తంలో టీఆర్ఎస్ పార్టీ అర్బన్ మ‌హిళా అధ్య‌క్షురాలిగా ప‌నిచేశారు. కేసీఆర్,‌ కేటీఆర్ల నుంచి హమీ ల‌భించ‌డంతోనే చాలా ఆశలు పెట్టకున్నా అంటూ ఆవేదన వ్య‌క్తం చేస్తోంది. ఉద్యమంలో చాలా చురుకుగా మొదటి నుంచి పాల్గొన్నాన‌ని, ఇప్ప‌టికీ అనేక కేసుల్లో తాను పోలీస్ స్టేష‌న్ల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తోంద‌ని వాపోయింది. పార్టీ కోసం సొంతంగా ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసుకుని కుటుంబాన్ని ఆగం చేసుకున్నానని చెబుతోంది. తనకు టికెట్ ఇవ్వడానికి కొంత‌మంది రూ.50 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపిస్తోంది. పార్టీ తనకు టికెట్ కేటాయించకుంటే పెట్రోల్ పోసుకోని పైననే కాల్చుకోని చనిపోతానంటూ పార్టీ నాయ‌కుల‌ను హెచ్చ‌రిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed