- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దారుణ హత్య
దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిని అతిదారుణంగా హత్యచేశారు దుండగులు. అర్ధరాత్రి దారి కాసి కత్తులతో పొడిచి చంపారు. హత్యకు అక్రమ సంబంధంలో హతుడు ఇచ్చిన తీర్చే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..
సూర్యాపేట మండలం రాజానాయక్ తండాకు చెందిన టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆదివారం రాత్రి సమయంలో తన సోదరుడి ఇంటి నుంచి వెళ్తుండగా.. దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి పారిపోయారు. కడుపు, ముఖంపై తీవ్రగాయాలైన రక్తపు మడుగులో పడి ఉన్న శంకర్ నాయక్‌ను కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తించి సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.
కాగా, ఈ హత్యకు పాతకక్షలే కారణమని తండావాసులు పేర్కొంటున్నారు. గతంలో ఇదే తండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తుండగా శంకర్ నాయక్ వారిని మందలించినట్లు చెబుతున్నారు. వివాహేతర సంబంధాలపై తండాలో జరిగిన పంచాయితీల్లో శంకర్ నాయక్ పెద్ద మనిషిగా వ్యవహరించి ఆ ఇద్దరు యువకులను మహిళల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలోనే హత్య చేసి ఉంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హత్యకు ఇదే కారణం కావచ్చని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. హతుడి బంధువుల ఫిర్యాదు మేరకు సూర్యాపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కు తరలించారు.