- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్ బంద్‌కు టీఆర్ఎస్ మద్దతు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేస్తున్నామంటూ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ… వారం నుంచి రైతులు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. చాలా రాష్ట్రాల్లో రైతులు… వెనక్కి తగ్గొద్దని మద్దతు పలుకుతున్నారు. అయితే ఈ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గకుండా పట్టుదలతో ఉండటంతో రైతులు డిసెంబర్ 8 దేశవ్యాప్త బంద్ పిలుపు ఇచ్చారు. తాజాగా ఈ భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ శ్రేణులు ఈ బంద్‌లో ప్రత్యక్ష్యంగా పాల్గొంటారని అన్నారు. రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారని వెల్లడించారు. కొత్త వ్యవసాయ చట్టాలు కేంద్రం ఉపసంహరించుకునే వరకూ తాము పోరాటం కొనసాగిస్తామని స్పస్టం చేశారు. అంతేగాకుండా ప్రజలు కూడా ఈ బంద్‌ను విజయవంతం చేసి, రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.