అట్టహాసంగా టీఆర్ఎస్ ప్లీనరీ.. 29 రకాల తెలంగాణ వంటలు

by Shyam |   ( Updated:2021-10-25 00:19:37.0  )
TRS Plenary meeting
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ మహానగరం మొత్తం గులాబీమయమైంది. హైటెక్స్‌లో సోమవారం నిర్వహించే టీఆర్‌ఎస్ ప్లీనరీకి వివిధ జిల్లాల నుంచి పలువురు టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్లీనరీకి హాజరయ్యే అతిథులకు నోరూరించే వంటకాలు సిద్ధమవుతున్నాయి. 14 వేల మందికి సరిపడా 29 రకాల తెలంగాణ వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ధమ్ ​బిర్యానీ, పాయ, బోటీ ఫ్రై తదితర మాంసాహార వంటకాలతోపాటు స్వీట్లు, వెజిటేరియన్​ డిషెస్‌ను రెడీ చేస్తున్నారు. మూడు హాళ్లలో భోజనాలకు ఏర్పాట్లు చేయనున్నారు. వడ్డించేందుకు 500 మందిని సిద్ధం చేశారు.

Advertisement

Next Story