‘రాజ్యాంగాన్ని మోసం చేసిన 420 అర్వింద్’

by Shyam |
‘రాజ్యాంగాన్ని మోసం చేసిన 420 అర్వింద్’
X

దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆదివారం వరంగల్ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసింది. అయితే ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు జిల్లాలో దుమారం రేపుతున్నాయి. కాగా దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ స్పందించారు. అర్వింద్‌కు దమ్ముంటే మాపై ఆరోపనలు చేయడం కాదు, నిరూపించాలని సవాల్ విసిరారు. మేం ఒక్క గజం ఆక్రమించామని నిరూపించినా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, లేదంటే అర్వింద్ చేసినవి ఆరోపణలు అని ఒప్పుకోవాలని స్పష్టం చేశారు. నిజామాబాద్ ప్రజలను నమ్మించి, మోసం చేసి, పసుపు బోర్డు హామీ నెరవేర్చలేని అర్వింద్ మా పైనా ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీరు అభివృద్ధి చేయరు… చేసే మమ్మల్ని చేయనివ్వరా అని ఎంపీని, ఎమ్మెల్యేలు నిలదీశారు. ప్రజలను, రాజ్యాంగాన్ని మోసం చేసిన 420 ఎంపీ అర్వింద్ అని తీవ్ర స్థాయిలో ఘాటుగా విమర్శించారు. ఇకపై బీజేపీ నాయకులు మా జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Advertisement

Next Story